- Advertisement -
కొత్తగూడెం: పోలీస్ ఇన్‌ఫార్మర్ అనే నెపంతో ఓ యువకుడిని మావోయిస్టులు హత్య చేసిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ధనోరా ప్రాంతానికి చెందిన కుడియం అర్జున్ అనే యువకుడు మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. గ్రామ శివారులో నడిరోడ్డుపై అతడిని హత్య చేసి వెళ్లిపోయారు. గ్రామస్థుల సమాచారం మేరకు గంగులూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గంగులూరు ఏరియా కమిటీ పేరుతో మావోల కర పత్రాలు లభించాయి.
- Advertisement -