ఢిల్లీ: విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. భారతీయ విద్యార్థులను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొస్తామని వారు భరోసానివ్వడం జరిగింది. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతదేశానికి చెందిన విద్యార్థులను తిరిగి మన దేశానికి తీసుకురావటానికి భారత ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తోందన్నారు. నిరంతరం సరిహద్దు దేశాల అధికారులతో, భారత రాయబార కార్యాలయాల అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని పేర్కొన్నారు. సరిహద్దు దేశాలకు ప్రత్యేక విమానాలను పంపించి ఎటువంటి విమాన ఖర్చులు లేకుండా వారిని క్షేమంగా వారి స్వస్థలాలకు చేరవేయడం జరుగుతుందని, ఇప్పటికే 219 మంది భారతీయులతో కూడిన విమానం రొమేనియా నుండి బయలుదేరిందన్నారు. చిట్టచివరి విద్యార్థిని తరలించే వరకూ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన ఈ మిషన్ ఆగదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
చిట్టచివరి విద్యార్థిని కూడా తీసుకొస్తాం: కిషన్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -