రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటి ంచిన సినిమా ‘రాధే శ్యామ్’. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు ఈ సినిమాను సమర్పిస్తుండగా.. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా దర్శకుడు రాధాకృష్ణ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
మెయిన్ పాయింట్ నచ్చింది…
ఈ సినిమా స్టోరీ చెప్పిన వెంటనే ఇందులోని మెయిన్ పాయింట్ ప్రభాస్‌కు బాగా నచ్చింది. అతను పోషించిన విక్రమాదిత్య పాత్రలో ఉన్న విభిన్న షేడ్స్ విషయంలో ప్రభాస్ ప్రత్యేక శ్రద్ధ వహించి నటించారు.
ఇటలీ బ్యాక్‌డ్రాప్‌కి మార్చాను…
ఈ సినిమాను ముందుగా ఇండియాలోని ఓ హిల్‌స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో చేద్దామనుకున్నా. కానీ ప్రభాస్ ఇచ్చిన సూచనలతో ఇటలీ బ్యాక్‌డ్రాప్‌కి మార్చాను. అదే ఇప్పుడు ఈ సినిమాకు మెయిన్ విజువల్ ఎస్సెట్‌గా మారింది.
ప్రపంచంలోనే తొలిసారిగా…
రాజులు, యువరాజులు, అధ్యక్షుడు, ప్రధానమంత్రి వంటి పెద్ద పెద్దవారికి జ్యోతిష్యం, హస్తసాముద్రికం చెప్పే పల్మనిస్ట్ క్యారెక్టర్‌లో ప్రభాస్ నటించారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’.
ముచ్చటగా, రొమాంటిక్‌గా…
ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డేల జంట చాలా ముచ్చటగా, రొమాంటిక్‌గా ఉంటుంది. వారిద్దరి మధ్య లవ్‌స్టోరీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
నెక్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు…
తమన్ తన అద్భుతమైన రీరికార్డింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ సినిమాను నెక్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. ఈ సినిమాలోని మెజార్టీ విఎఫ్‌ఎక్స్ వర్క్‌ను ఉక్రెయిన్‌లో చేయించాము.
ఆ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా వస్తున్న ‘రాధేశ్యామ్’
- Advertisement -
- Advertisement -
- Advertisement -