న్యూఢిల్లీ: ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను ఇండియాకు తరలించే ప్రక్రియను భారత్ వేగవంతం చేసింది. బుకారెస్ట్ నుంచి ఢిల్లీకి మూడో విమానం కాసేపట్లో చేరుకోనుంది. ఇందులో 240మంది భారతీయ విద్యార్థులు భారత్ కు చేరుకున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ నుంచి రెండు విమానాలు భారత్ చేరుకున్నాయి. బుకారెస్ట్ నుంచి ఢిల్లీకి రెండో విమానంలో 250మంది భారతీయులు వచ్చారు. ఇందులో 11మంది ఏపి విద్యార్థులు, 17మంది తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. ముంబై చేరుకున్న విమానంలో ఉన్న 20 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. నిన్న ఉక్రెయిన్ నుంచి ముంబైకి విమానంలో 219మంది విద్యార్థులు చేరుకున్నారు. ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి భారత్ కు 469మంది విద్యార్థులు చేరుకున్నారు.
Telugu Students reached Shamshabad Airport from Ukraine