- Advertisement -
రంగారెడ్డి: జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. జిల్లాలోని మైలార్ దేవ్ పల్లి పారిశ్రామికవాడలో ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం సమయంలో సమీపంలో చెత్త సేకరిస్తున్న మహిళ ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన మహిళను సుశీలమ్మగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
Woman killed after explosion in Milardevpally
- Advertisement -