హైదరాబాద్: ఎపిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాపై నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ”సినిమా రంగంపై అధికార దర్వినియోగం ఎందుకు. చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా. ఏమైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి. కక్ష సాధింపు బాక్సాఫీసు వద్ద ఎందుకు. ఎంత ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆధారాభిమానాలకు అడ్డుకట్ట వేయలేరు. ఆధిపత్య ధోరణి దేనికోసం” అని ప్రకాశ్ రాజ్ ట్వీటర్ ద్వారా ప్రశ్నించారు. కాగా, ఈ నెల 25న విడుదలైన భీమ్లా నాయక్ మూవీ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. మొదటి రోజు ఏకంగా రూ.56కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సత్తా చాటింది. అయితే, ఎపిలో టికెట్ రేట్స్ పై కొత్త జీవి ఇవ్వకపోవడం, అదనపు షోలకు అనుమతివ్వకపోవడం, థియేటర్లపై అధికారులు తనిఖీలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కావాలనే చేస్తుందని పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Prakash Raj tweet against AP Govt over Ticket Rates