Saturday, November 23, 2024

తెలంగాణపై కేంద్రం సవతి తల్లిప్రేమ చూపుతోంది: ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

MLC Kavitha Criticisms of Central Government

హైదరాబాద్: తెలంగాణ రైతులపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని, ఈ విషయం మరోసారి బయటపడిందని ఎంఎల్‌సి కవిత విమర్శించారు. యాసంగిలో తెలంగాణలో అధిక శాతం బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) మాత్రమే ఉత్పత్తి అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సిఐకి తెలిసినా, రా రైస్ మాత్రమే కొంటామంటూ కేంద్రం మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించే పంటను కొనకుండా..పండిన పంటను కొంటామంటూ ప్రకటించి బిజెపి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే తరుణంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ వ్యవసాయం గురించి ఏమాత్రం అవగాహన లేని బండి సంజయ్.. యాసంగిలో రాష్ట్రంలో ఏ రకం బియ్యం ఉత్పత్తి అవుతాయో తెలుసుకోవాలని సలహా ఇచ్చింది. ఆయనకు తెలియకపోతే రాష్ట్రంలో ఏ రైతున అడిగినా మీకు జ్ఞానోదయం చేయిస్తారని అన్నారు. బిజెపి నేత అర్థజ్ఞానంతో అన్నదాతలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News