Monday, November 18, 2024

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన కేంద్ర టూరిజం డైరెక్టర్

- Advertisement -
- Advertisement -


మనతెలంగాణ/హైదరాబాద్:  రామప్ప దేవాలయాన్ని భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ టూరిజం డైరెక్టర్ జనరల్ జి. కమలవర్ధన్ రావు సోమవారం సందర్శించారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో కలిసి ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యునెస్కో గుర్తింపు వచ్చిన సందర్భంగా పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ‘రామప్ప ప్రసాద్’ పథకం రాష్ట్ర ప్రతిపాదితన స్థలాలను ఆయన తనిఖీ చేశారు. అనంతరం రామప్ప శిల్ప కళా నైపుణ్యాన్ని గైడ్ విజయ్‌ను అడిగి తెలుసుకున్నారు. గుడిలోని రాతి కట్టడాలను, శిల్ప కళా నైపుణ్యాన్ని గైడ్ ఆయనకు వివరించారు. పర్యాటక రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News