- Advertisement -
హైదరాబాద్ : ఉద్యోగ విరమణ పొందిన వారు విలువైన సమయాన్ని కుటుంబంతో గడుపాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. అంబర్ పేట సిఎఆర్‌లో ఎఎస్సైగా పనిచేస్తున్న ఆర్. గోవింద్ సింగ్, నాచారం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎఎస్సై రామకృష్ణ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్బంగా వారికి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సోమవారం చెక్కులు, బెనిఫిట్స్‌కు సంబంధించిన కాగితాలు అందించారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, అడ్మిన్ ఎడిసిపి శ్రీనివాసులు, సిఎఓ పుష్పరాజ్, సుగుణ, భద్రారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -