మనతెలంగాణ/ హైదరాబాద్ : పిసిసిఎఫ్‌గా పదవీ విరమణ పొందిన ఆర్. శోభను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (అటవీ వ్యవహారాలు) నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. రెండేళ్ల పాటు ఆమె సలహాదారుగా కొనసాగనున్నారు. 1988లో అటవీశాఖలో ఆర్.శోభ విధుల్లో చేరారు. 2019 జూలై 31న పిసిసిఎఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో అడవుల రక్షణ, అటవీ పునర్ జీవనం, హరితహారం వంటి కార్యక్రమాలను ఆమె సమర్థవంతంగా నిర్వహించారు. సోమవారం అరణ్యభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పిసిసిఎఫ్ పదవీ విరమణ పొందిన ఆర్.శోభను మంత్రితో పాటు అటవీశాఖ ఉన్నతాధికారులతో పాటు పలువురు ఉద్యోగులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆమె సేవలను ప్రశంసించారు. ఆమెను ప్రభుత్వ సలహాదారుగా (అటవీ వ్యవహారాలు) నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మంత్రి అందజేశారు.