Saturday, December 21, 2024

మరచిపోలేని అనుభవం

- Advertisement -
- Advertisement -

Rashmika mandanna act in adavallu meeku joharlu

 

శర్వానంద్‌కు జోడీగా రష్మిక మందన్న నటించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా రష్మిక మీడియాతో మాట్లాడుతూ “-దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పిన కథ వినగానే నాకు నచ్చింది. ఈ సినిమాలో ఇంత మంది లేడీస్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా వాటిలో ఎవరు నటిస్తారనే ఉత్సుకత మొదట కలిగింది. ఆ పాత్రలకు ఎవరెవరిని అనుకుంటున్నారో చెప్పాక సంతోషపడ్డాను. ఈ సినిమాలో ప్రధానంగా ఇంటర్వెల్ సీన్ ఒకటి నన్ను బాగా ఆకట్టుకుంది. – ఈ చిత్రంలో నా పాత్ర పేరు ఆద్య. ఆమె ముక్కుసూటి మనిషి. మొహమాటంగా ఉండదు. అనుకున్నది చెప్పేస్తుంది. సినిమా నిండా ఆడవాళ్లమే ఉంటాం కాబట్టి సెట్‌లో మగవాళ్లంతా మమ్మల్ని చూసి .. వీళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో అంటూ ఇబ్బంది పడేవారు. – ఈ సినిమాలో మా క్యారెక్టర్స్ అన్నీ డైలాగ్ ప్రధానంగా సాగుతుంటాయి. అందరూ మాట్లాడుతుంటారు. అవన్నీ మనం ఇంట్లో మాట్లాడుకుంటున్నట్లు సహజంగా ఉంటాయి. – ఈ సినిమాలో రాధిక, కుష్బూ, ఊర్వశి వంటి సీనియర్ నటీమణులతో కలిసి పనిచేయడం మరచిపోలేని అనుభవం”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News