Sunday, November 24, 2024

శంషాబాద్ చేరుకున్న 11మంది తెలంగాణ విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

11 Telangana students reached Shamshabad

మన తెలంగాణ/శంషాబాద్: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు క్షేమంగా తిరిగి వచ్చారు. రుమేనియా బార్డర్ కు దగ్గరగా ఉన్న 500 మంది విద్యార్థులను రెండు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తరలించారు. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. సోమవారం సాయంత్రం తెలుగు విద్యార్థులు డిల్లీ నుండి ఇండిగో విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. శంషాబాద్ చేరుకున్న వారిలో 11మంది విద్యార్థులు ఉన్నారు. వారికి అధికారులు స్వాగతం పలికి వారిని స్వస్థలాలకు పంపించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో విద్యార్థుల తల్లిదండ్రులు వారిని చూసి సంతోషం వ్యక్తం చేశారు. తమ పిల్లలను క్షేమంగా తీసుకువచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా ఉక్రెయిన్‌లో వైద్య విద్య అభ్యసించడానికి వెళ్ళిన శంషాబాద్ మున్సిపల్‌లోని ఆర్.బి నగర్ కాలనీకి చెందిన నిషా రాణి సోమవారం సాయంత్రం ఇంటి కి చేరుకుంది. కూతురుని చూసిన తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. తల్లిదండ్రులు మాట్లాడు తూ తమ కూతుర్ని తిరిగి భారత్‌కు క్షేమంగా తీసుకురావ డం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సిఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News