Friday, December 20, 2024

అంతర్జాతీయ పోటీల నుంచి రష్యా బహిష్కరణ..

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్ పై బాంబుల మోతతో భీకర దాడులకు పాల్పడుతున్న రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఉక్రెయిన్ పై దాడులను ఖండిస్తూ రష్యాను ఏకాకిని చేస్తున్నాయి. తాజాగా రష్యా ఫుట్ బాల్ జట్లపై ఫిఫా, యూఈఎఫ్ఎ వేటు వేశాయి. ఉక్రెయిన్ ప్రజలకు ఫిఫా, యూఈఎఫ్ఎ సంఘీభావం తెలిపుతూ.. ఈ ఏడాది జరగనున్న ప్రపంచ కప్ తోపాటు అన్ని అంతర్జాతీయ పోటీల నుంచి బహిష్కరించాయి. ఫుట్ బాల్ ప్రపంచకప్ ఈ ఏడాది చివరలో జరగనుండగా.. మార్చి 24న పోలాండ్, రష్యా క్వాలిఫైయింగ్ ప్లే ఆఫ్ సెమీ ఫైనల్ జరగనుంది. తర్వాత స్వీడన్ లేదా చెక్ రిపబ్లిక్ తో రష్యా తలపడే ఛాన్స్ ఉంది. అయితే, ఉక్రెయిన్ పై దాడులకు కొనసాగిస్తున్న నేపథ్యంలో రష్యా జట్లతో ఆడడానికి పోలాండ్ స్వీడన్, చెక్ రిపబ్లిక్ నిరాకరించాయి. మూడు జట్లు రష్యా బహిష్కరణకు పట్టుబట్టాయి. దీంతో రష్యాపై వేటు వేశారు. తదిపరి నోటిసు ఇచ్చేవరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని స్పష్టం చేశాయి. మరోవైపు ఫిఫా, యూఈఎఫ్ఎ నిర్ణయాన్ని రష్యా ఖండించింది. తమపై వివక్షను ప్రదర్శిస్తున్నారని రష్యా అభివర్ణించింది.

FIFA and UEFA Suspend Russia from International Football

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News