ట్విట్టర్ వేదికగా మంత్రులు కెటిఆర్, హరీష్‌రావు, ఎంపి సంతోష్‌లు వెల్లడి
హైదరాబాద్: తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని మంత్రులు కెటిఆర్, హరీష్‌రావ్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌లు అన్నారు. తలసరి ఆదాయం 2014 నుంచి 2021 వరకు 125 శాతం (2014లో రూ.1,24,104గా ఉన్న తలసరి ఆదాయం 2021 నాటికి రూ.2,78,833కి ఎగబాకింది) పెరిగిందని, జిఎస్‌డిపి 130 శాతం (2014లో రూ.5లక్షలు ఉన్న జిఎస్‌డిపి 2021 నాటికి రూ.11.54 లక్షలకు చేరింది) పెరిగినట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణ అన్నింట్లోనూ వెలిగిపోతోందని, ఆ వైభవమే కాదు.. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం విజయపథంలో దూసుకువెళ్తోందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని.. కేంద్రం విడుదల చేసిన గణాంకాలే సాక్షాలుగా నిలుస్తున్నాయన్నారు. విభజన సమస్యలు పరిష్కారం కానప్పటికీ, కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ, కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేనప్పటికీ..సిఎం కెసిఆర్ తన నాయకత్వ పటిమతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో రాష్ట్రం దూసుకుపోతోందని మంత్రి హరీష్‌రావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో అద్భుతాలు సృష్టిస్తోందంటూ ట్విట్టర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు పెడుతోందనేందుకు ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండబోదన్నారు. తలసరి ఆదాయ వృద్ధిరేటులో దేశంలోనే రాష్ట్రం ఆగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలే రుజువుపరుస్తున్నాయని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి బాటలో పయనిస్తోందనేందుకు తాజా గణాంకాలే ప్రత్యక్ష తార్కాణాలని ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ తెలిపారు. డైనమిక్ లీడర్‌గా ఉన్న సిఎం కెసిఆర్ వల్లే ఇది సాధ్యపడగలిగిందన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం 19.10 శాతంగా నమోదు కాగా.. జిఎస్‌డిపిలోనూ 19.46 శాతం వృద్ధిరేటును నమోదు చేసిందని వెల్లడించారు. తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు పెడుతోందనేందుకు ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండబోదన్నారు.