Friday, December 20, 2024

ఉక్రెయిన్‌నుంచి 5 లక్షల మందికి పైగా వలస

- Advertisement -
- Advertisement -
More than 5 lakh people migrated from Ukraine
ఐక్యరాజ్య సమితి వలసల విభాగం అంచనా

బుడాపెస్ట్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు రోజురోజుకు తీవ్రమవుతూ ఉండడంతో ప్రాణాలు అరచేత పట్టుకుని ఉక్రెయిన్‌నుంచి యూరోపియన్ యూనియన్ తూర్పు వైపునకు శరణార్థుల వలసలు భారీ ఎత్తున కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటివరకు ఆ దేశంనుంచి 5 లక్షల మందికి పైగా ఇప్పటికే పొరుగు దేశాలకు పారిపోయినట్లు ఒక్కరాజ్య సమితి అంచనా వేస్తోంది. ఉక్రెయిన్ నుంచి తరలి వచ్చే వారి కార్లు, బస్సులతో పోలాండ్, హంగరీ, స్లోవేకియా, రొమేనియా, మోల్డావియా సరిహద్దుల్లోని చెక్‌పాయింట్లు నిండి పోయాయి. వేలాది మంది కాలి నడకన తమ సామానులను లాక్కుంటూ సరిహద్దులను దాటి యూరోపియన్ యూనియన్ దేశాల్లోకి అడుగుపెడుతున్నారు.

హంగరీ సరిహద్దు గ్రామమైన బెరెగ్‌సురానీ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రిసిప్షన్ సెంటర్ వద్ద వందలాది మంది ట్రాన్సిట్ కేంద్రాల వద్దకు వెళ్లేందుకోసం రవాణా సదుపాయం కోసం ఎదురు చూస్తూ ఉండడం కనిపించింది. అక్కడినుంచి హంగరీలోకి, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వారికి వీలు కలుగుతుంది. కాగా ఇక్కడికి చేరుకున్న వారిలో ఎక్కువ మంది భారత్, ఆఫ్రికా దేశాలకు చెందిన విద్యార్థులే ఉన్నారు. తమ పౌరుల కోసం భారత ప్రభుత్వం బుడాపెస్ట్‌నుంచి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసినందున తాను అక్కడికి చేరుకోగలనని ఆశిస్తున్నట్లు 22 ఏళ్ల మస్రూర్ అహ్మద్ అనే వైద్య విద్యార్థి చెప్పాడు. అతను టెమోపిల్‌లో వైద్య విద్య చదువుతున్నాడు. మరో 18 మంది విద్యార్థులతో కలిసి అతను ఆక్కడికి చేరుకున్నాడు.

కొన్ని దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా హంగరీ ఉక్రెయిన్‌కు చెందని వారిని సరిహద్దులనుంచి డెబ్రెసిన్, బుడాపెస్ట్ విమానాశ్రయాలకు తరలించడానికి ఒక ‘మానవతా కారిడార్’ను ఏర్పాటు చేసింది. ఒకప్పుడు మధ్యప్రాచంనుంచి శరణార్థులను స్వీకరించడానికి నిరాకరించిన హంగరీ ఇప్పుడు ఉక్రెయిన్‌నుంచి వచ్చే వారి కోసం తన సరిహద్దులను బార్లా తెరవడం గమనార్హం. యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్‌నుంచి 5 లక్షల మందికి పైగా ప్రజలు వలస వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి వలసల విభాగం హైమిషనర్ ఫిలిప్పో గ్రాండీ తెలిపారుఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉందని ఆయన సోమవారం ట్విట్టర్‌లో తెలిపారు. తాజా లెక్కల ప్రకారం పోలండ్‌లో 2,81,000,హంగరీలో 84,500 మంది, మోల్డోవాలో 36,400 మంది, రొమేనియాలో 32,500 మంది, స్లోవేకియాలో 30,000 మంది ఉన్నట్లు ఈ విభాగం అధికార ప్రతినిధి షబియా మాంటో తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News