Monday, December 23, 2024

జోరుగా… హుషారుగా

- Advertisement -
- Advertisement -

నవ్వుల రైడ్ ఎఫ్2 సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్3 మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ‘ఎఫ్ 3’ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో వెంకటేష్, వరుణ్‌తేజ్‌లు హుషారుగా కనిపించారు. ఇప్పటికే ఈ చిత్రం ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు ముగించుకొని మే 27న థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ కీలక పాత్రల్లో నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News