- Advertisement -
చేనేత జౌళి శాఖ సంచాలకురాలు నాగరాణి
19 రాష్ట్రాల నుంచి వందలాది నేత కళాకారుల వస్త్ర శ్రేణి
ప్రత్యేక రాయితీలతో ఆప్కో విక్రయ కేంద్రం
హైదరాబాద్: చేనేత రంగాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో మార్చి 4వ తేదీ నుంచి 18వ తేదీ వరకు విజయవాడ వేదికగా జాతీయ చేనేత ప్రదర్శనను నిర్వహించనున్నట్లు రాష్ట్ర చేనేత జౌళి శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మార్కెటింగ్ వ్యూహాలను అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం ఈ రెండింటినీ అనుసంధానం చేయడం ప్రధాన ధ్యేయంగా దేశ వ్యాప్తంగా జాతీయ స్థాయి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విజయవాడ మొగల్రాజపురంలోని ఎ-ప్లస్ కన్వెన్షన్ సెంటర్ ఈ పదిహేను రోజుల ప్రదర్శనకు వేదిక కానుందన్నారు. చేనేత సంఘాలు, నేత కార్మికులు ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌లకు అనుగుణంగా రూపొందించిన తమ విభిన్న ఉత్పత్తులు, వినూత్న డిజైన్లను నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి దేశీయ మార్కెటింగ్ ఈవెంట్‌లు నిర్వహిస్తారని నాగరాణి పేర్కొన్నారు.
- Advertisement -