న్యూఢిల్లీ: కల్లోలిత ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మరణించారు. పంజాబ్‌లోని బర్నాలాకు చెందిన చందన్ జిందాల్(22) అనే వైద్య విద్యార్థి ఇస్కీమిక్ స్ట్రోక్(మెదడుకు రక్తసరఫరాలో లోపం ఏర్పడడం) కారణంగా బుధవారం ఉదయం మరణించారు. విన్నిట్‌సియాలోని నేషనల్ పిరొగోవ్ మెమోరియల్ వైద్య విశ్వవిద్యాలయంలో చందన్ మెడిసిన్ చదువుతున్నారు. ఆయనకు ఇస్కీమిక్ స్ట్రోక్ రావడంతో విన్నిట్‌సియాలోని ఎమర్జెన్సీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించారు. తమ కుమారుడి మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని అర్థిస్తూ చందన్ తండ్రి భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. కాగా.. మంగళవారం ఖర్కీవ్‌లో రష్యా సేనల దాడిలో మరణించిన కర్నాటకకు చెందిన భారతీయ వైద్య విద్యార్థి నవీన్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఉక్రెయిన్‌లో గగనతలాన్ని మూసివేయడంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను తరలించిన విధంగానే ఇతర దేశాల నుంచి ఈ మృతదేహాలను తరలించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
Second Indian Student dies in Ukraine