రూ.2 లక్షల విలువ చేసే రాష్ట్ర ప్రభుత్వ నిషేదిత గుట్కా స్వాధీనం
స్పెషల్ బ్రాంచ్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ
మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు సహకరించాలి
జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి
మనతెలంగాణ/ ఆదిలాబాద్ ప్రతినిధి: భుక్తాపర్ ప్రాంతంలో రెండు లక్షల రూపాయల విలువైన నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్ పి ఉదయ్ కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ నందు జిల్లా ఎస్పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ పట్టణంలోని బుక్తాపూర్ ప్రాంతంలో నిందితుడు మొహమ్మద్ అక్రమ్ (34)కు చెందిన గోడౌన్ లో భారీ ఎత్తున గుట్కా ఉందని విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఆదిలాబాద్ ఒకటో పోలీస్ స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా దాడి చేయగా రూ.2లక్షల విలువ చేసే రాష్ట్ర ప్రభుత్వ నిషేధిత గుట్కా లభించిందని తెలిపారు.
నిందితుడిపై ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు.ఈ దాడిలో మొత్తం ఆర్‌కే క్లాసిక్ రూ. 1,30,000 వి1 ప్యాకెట్లు రు.50,000. అలాగే కేసి తంబాకు ప్యాకెట్లు రూ.20,000 లభించాయని తెలిపారు. నిందితుడిపై 2019 నుండి ఇప్పటి వరకు 17 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడి పై గతంలో సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగిందని తెలిపారు. పట్టణంలో గుట్కా అమ్మే ఇతర వ్యాపారస్తులపై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, వారు కూడా గుట్కా విక్రయాన్ని ఆపివేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా గుట్కా నిర్మూలన కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులను ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ అభినందించారు.
అదేవిధంగా జిల్లా ప్రజలకు గుట్కా, గంజాయి వాడకం వలన క్యాన్సర్ లాంటి పాణాంతక వ్యాదులు వస్తాయని, ప్రజలు మాధక ద్రవ్యాల అలవాట్లను మానుకొని తమజీవితాలను సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి నుండి గుట్కా నిర్మూలనకు మూకుమ్మడి దాడులు ,కార్డన్ సర్చ్‌లు, ఒకే సారి జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి గుట్కాను నిర్మూలించడానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు సైతం జిల్లాలో ఎటువంటి మాదక ద్రవ్యాల సమాచారం తెలిస్తే జిల్లా పోలీసు అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ సమావేశంలో పట్టణ డీఎస్పీ వెంకటేశ్వర్‌రావ్, ఒకటో పట్టణ సిఐ రామకృష్ణ, డబ్ల్యుపిఎస్ ఇన్స్‌పెక్టర్ మల్లేష్ , స్పెషల్ బ్రాంచ్ సిఐ కృష్ణమూర్తి, ఎస్ఐలు అన్వర్, అప్పారావ్, రవీంధర్, కలీమ్, స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ దేవిదాస్,ఏ సుదాస్ తదితరులు పాల్గొన్నారు.