Monday, January 20, 2025

నగరం రోడ్ల మీదనే ఇష్టా రాజ్యంగా పార్కింగ్

- Advertisement -
- Advertisement -

ప్రైవేట్ ట్రావెల్స్
పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్
పట్టించుకోని అధికారులు

Parking mafia in hyderabad roads
మనతెలంగాణ,సిటీబ్యూరో: ఒక వైపు నగర రహదారులపై నిత్యం ట్రాఫిక్ సమస్యలకు కారణం అవుతూ మరో వైపు ఆర్టిసి ఆదాయానికి గండి కొడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై అధికారులు నిర్లక్షం వహిస్తున్నారు.ప్రైవేట్ బస్సులను ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా రాక పోకలు సాగించేలా ఏర్పాట్లు చేయాలని సాక్షాత్తు నాటి రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశించినా అమలుకు నోచుకోవడం లేదు. నిబంధనలకు విరుద్దంగా ట్రావెల్స్ బస్సులు నగర రోడ్లపై యథేచ్చగా తిరుగుతున్నాయి. కాంట్రాక్టు క్యారేజి బస్సులుగా పర్మిట్లు పొందిన వాటి యాజమాన్యం వాటిని స్టేజి క్యారియర్లుగా తిప్పుతున్నారు. రాత్రి 9 గంటల నుంచి మియాపూర్, కేపిహెచ్‌ఎబి, లింగంపల్లి, బిహెచ్‌ఈఎల్, ప్రాంతంలో బయల్దేరిన బస్సులను 11 గంటల నుంచి 12 గంటల వరకు నగరంలోని సంజీవ్‌రెడ్డినగర్, అమీర్‌పేట,లక్డికాపూల్(టెలిఫోన్ భవన్), దిల్‌షుక్‌నగర్,ఎల్‌బినగర్,హయత్‌నగర్, ఈ విధంగా ప్రతి నిలుపుతూ ప్రయాణికులను ఎక్కించుకోవడంతో ఆయా ప్రాంతాల్లో త్రీవ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.

కొన్ని ప్రాంతాల్లో రాత్రి 9 గంటలు దాటితే ట్రాఫిక్ పోలీసులు కనిపించక పొవడంతో నడి రోడ్డు మీదే తమ వాహనాలను నిలుతుండటంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. హైదరాబాద్ నుంచి రోజు 500 నుంచి 7 వరకు ప్రైవేట్ బస్సులు ఏపీలోని విజయవాడ,మచిలీ పట్నం, ఏలూరు,బీమవరం,రాజమండ్రి,విశాఖపట్నం,తిరుపతి తదితర ప్రాంతాలకే కాకుండా మన రాష్ట్రంలోని భద్రాచలం,బాసర,వేముల వాడ, ఖమ్మం ప్రాంతాలకు వెళుతున్నాయి. అంతే కాకుండా బెంగుళూరు,మైసూర్,పూనే,షిర్డి తదితర ఇతర రాష్ట్రాలకు పెద్ద సంఖ్యలో రాక పోకలు సాగిస్తున్నాయి. పర్వదినాలు, వరుస సెలవు దినాల్లో వీటి రెట్టింపవుతుంది.

సాధారణంగా శని,ఆదివారాల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటోంది. వాటితో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాత్రి 10 గంటల తర్వాతే నగరంలోకి ఆయా ట్రావెల్స్ బస్సులు వచ్చేలా అధికారులు నిబంధనలు పెట్టారు. కాని ఆచరణలో మాత్రం అవి ఎక్కడా కనిపించడం లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నగరంలో ఒక చోట ప్రయాణికులతో ప్రారంభమై ఎక్కడా ఆపకుండా గమ్యస్థానానికి చేరుకోవాలి. అందు కోసం ఆయా బస్సులు క్యారేజి పర్మిట్లు తీసుకోవాలి. కాని నగరంలో వందలాది బస్సులు సిటీ బస్సులు మాదిరిగా 10 నుంచి 20 చోట్ల ఆపుతూ ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. దాంతో ట్రాఫిక్ సమస్యతో ఆర్టిసికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.దూర ప్రాంతాలకు ఆర్టిసి బస్సులను వేస్తున్నా సరైన ఆదరణ ఉ ండటం లేదని అధికారులు చెబుతున్నారు.

ప్రైవేట్ బస్సులను అవుటర్ రింగ్ రోడ్దు మీదుగా దారి మళ్ళించాలని నాటి రవాణశాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిని సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆదేశాలు పాటిస్తే నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా ఆర్టిసి ఆదాయం కూడా పెరిగి అవకాశం ఉంది. అందుకు నగర శివారు ప్రాంతాల్లో అవసర ప్రాంతాలను సూచించాలని మంత్రి ఆదేశించి సంవత్సరాలు దాటుతున్నా ట్రాఫిక్ పోలీసులు కాని, ఆర్టిఏ అధికారులు కాని ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ట్రావెల్స్ బస్సుల యజమానులతో లోపాయికారి ఒప్పదం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం చుట్టూ పూర్తి స్థాయిలో ఔటర్ రింగ్ రోడ్డు పలు చోట్ల రేడియల్ రోడ్లు అందుబాటులోకి రావడంతో రాక పోకలకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News