న్యూఢిల్లీ: ‘భారత్‌లో కొత్తగా 7554 కరోనావైరస్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,38,599కి చేరింది. కాగా యాక్టివ్ కేసులు 85,680కు పడిపోయాయి’ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం డేటాను అప్‌డేట్ చేసింది. కొత్తగా 223 మరణాలతో మరణాల సంఖ్య 5,14,246కు పెరిగింది. గత 24 రోజుల్లో కొవిడ్19 కేసులు లక్ష కన్నా తక్కువగానే నమోదయ్యాయి. మొత్తం సాంక్రమిత కేసుల్లో యాక్టివ్ కేసులు 0.20 శాతంగా ఉన్నాయి. కాగా కొవిడ్19 కేసుల రికవరీ రేటు 98.60 శాతానికి పెరిగిందని కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా గత 24 గంటల్లో కొవిడ్19 యాక్టివ్ కేసులు 6,792 మేరకు తగ్గాయి. కొవిడ్19 నుంకి కోలుకున్న వారి సంఖ్య 4,23,38,673కు పెరిగింది. కాగా మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా చేపట్టిన క్యుములేటివ్ డోస్‌లు 177.79 కోట్లను దాటింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కొవిడ్‌తో చనిపోయినవారి సంఖ్య 5,14,246కు చేరింది. 70 శాతం మేరకు మరణాలు సహసంబంధ వ్యాధుల(కోమార్బిడిటీస్) కారణంగానే సంభవించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
భారత్‌లో 85,680కు తగ్గిన కొవిడ్19 యాక్టివ్ కేసులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -