- Advertisement -
జాతీయ సీనియర్ చెస్ టోర్నీ
మన తెలంగాణ/హైదరాబాద్: కాన్పూర్ వేదికగా జరుగుతున్న జాతీయ సీనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బుధవారం తమిళనాడు గ్రాండ్ మాస్టర్ పి. ఇనియన్‌తో జరిగిన పదో రౌండ్‌ను అర్జున్ డ్రాగా ముగించాడు. తొమ్మిదో రౌండ్‌లో విజయం సాధించి అగ్రస్థానంలోకి దూసుకెళ్లిన అర్జున్ పదో రౌండ్‌ను డ్రా చేసి టైటిల్ అవకాశాలను క్లిష్టం చేసుకున్నాడు. మరోవైపు తమిళనాడు గ్రాండ్ మాస్టర్ గుకేశ్ పదో రౌండ్‌లో విజయం సాధించి అర్జున్‌తో పాటు సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బుధవారం జరిగిన పోరులో గుకేశ్ మాజీ జాతీయ చాంపియన్ అభిజీత్ గుప్తాను ఓడించాడు. ఇక గురువారం చివరి రౌండ్ పోటీలు జరుగనున్నాయి.
- Advertisement -