Wednesday, January 22, 2025

విరాట్ శతకం కొట్టాలి..

- Advertisement -
- Advertisement -

South africa series became a challenge for virat kohli

ముంబై: చారిత్రక వందో టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లి శతకం కొట్టాలని భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆకాంక్షించారు. కెరీర్‌లో అత్యంత అరుదైన మ్యాచ్‌ను ఆడుతున్న కోహ్లి సెంచరీ సాధిస్తే అంతకంటే ఆనందం మరోకటి ఉండదన్నారు. ఈ మ్యాచ్‌లో విరాట్ శతకం సాధించినా ఆశ్చర్యం లేదన్నారు. టీమిండియాకు లభించిన ఆణిముత్యాల్లో కోహ్లి ఒకడని ప్రశంసించారు. అతనిలా క్రికెట్‌పై అంకితాభావం ఉన్న ఆటగాళ్లు చాలా అరుదుగా ఉంటారన్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని ముందుకు సాగడం అతని ప్రత్యేకతని అభివర్ణించారు. ఈ మ్యాచ్‌ను కోహ్లి శతకంతో తీపి జ్ఞాపకంగా మలుచుకుంటాడనే నమ్మకం తనకుందన్నారు. టీమిండియా క్రికెటర్లు కూడా విజయంతో తమ మాజీ సారథిగా అరుదైన బహుమతిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని గవాస్కర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News