తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి
మనతెలంగాణ/ హైదరాబాద్ : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై జరిగిన కుట్రను ఉద్యోగ సంఘం, ఎంప్లాయిస్ జెఎసి తీవ్రంగా ఖండిస్తున్నామని టిజిఓ అధ్యక్షురాలు మమతా అన్నారు. గురువారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్రను ఖండిస్తూ.. హైదరాబాద్‌లో టిజిఓ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జెఎసి సమావేశాన్ని సంఘం అధ్యక్షురాలు మమత ఆధ్వర్యంలో నిర్వహించారు. నాంపల్లిలో నిర్వహించిన సమావేశంలో పెద్ద ఎత్తున పాల్గొన్న అధికారులు మంత్రికి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కుట్ర వెనుక ఉన్న అసలు కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ద్రోహుల రా ఖబడ్దార్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా మమతా, టిఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. ఎమ్మెల్యేగా , మంత్రిగా అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మంత్రిని కాపాడుకోవడానికి ముందుగానే పసిగట్టి కుట్రను నివృత్తం చేసిన పోలీస్ శాఖను అభినందిస్తున్నాం. మూడు రోజులు నల్లబ్యాడ్జీలతో నిరసనలు వ్యక్తం చేస్తాం. కుట్రదారులను వెంటనే శిక్షించాలని రాష్ట్ర హోంమంత్రిని, డిజిపిని కోరుతున్నామన్నారు.