Monday, December 23, 2024

ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి

- Advertisement -
- Advertisement -

 

శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ వేడుకలో కిశోర్ తిరుమల మాట్లాడుతూ “ఈ సినిమాతో థియేటర్లు ఫ్యామిలీలతో కళకళలాడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో లవ్‌స్టోరీ కూడా ఉంది. యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. ఇంటర్వెల్ సీన్‌కు మహిళలు చప్పట్లు కొడతారని గట్టిగా చెప్పగలను” అని తెలిపారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ “అందరూ ఫ్యామిలీతో వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ప్రేక్షకులు నవ్వుకుంటూ వెళ్తారు”అని అన్నారు. రష్మిక మందన్న మాట్లాడుతూ “చాలా కాలం తర్వాత ఫ్యామిలీ సినిమా చేశాం. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ సినిమా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలోని పాత్రలు మన ఇంట్లో అమ్మ, చెల్లి ఎలా మాట్లాడతారో అలాగే ఉంటాయి”అని పేర్కొన్నారు. ఈ వేడుకలో ఝాన్సీ, సుజిత్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News