Friday, January 10, 2025

నెపోలియన్, హిట్లర్‌లా అమెరికా ప్రవర్తిస్తోంది

- Advertisement -
- Advertisement -

America is behaving like Napoleon, Hitler

పశ్చిమ దేశాలే అణు యుద్దానికి ఉసిగొల్పుతున్నాయి
రష్యా విదేశాంగమంత్రి లావ్రోవ్ ధ్వజం

మాస్కో: రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురువారం తాజాగా మరోసారి పశ్చిమ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే అది అణు యుద్ధమే అవుతుందని మళ్లీ స్పష్టం చేశారు. గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్న లావ్రోవ్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆంక్షలతోనే మూడవ ప్రపంచ యుద్ధానికి దిగుతామన్న బైడెన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ.. మూడవ ప్రపంచ యుద్ధం కేవలం అణు యద్ధమే అవుతుందని అన్నారు. అణు యుద్ధం చేయాలని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయని, ఆ ఆలోచన పశ్చిమ దేశాల నేతల్లోనే ఉందని, రష్యా ప్రజల మనోభావాల్లో ఆ ఉద్దేశం లేదని లావ్రోవ్ అన్నారు. ఒకవేళ ఎవరైనా నిజమైన యుద్ధం చేయాలని భావిస్తే అప్పుడు వాళ్లు అలాంటి ప్రణాళికల గురించి ఆలోచించాలన్నారు. అమెరికా ఓ నెపోలియన్, హిట్లర్ తరహాలో ప్రవర్తిస్తోందని ఆయన ఆరోపించారు. గతలో నెపోలియన్, హిట్లర్‌లు.. యూరప్‌ను తమ అధీనంలోకి తెచ్చుకోవాలని భావించారని, ఇప్పుడు అమెరికన్లు కూడా అదే చేస్తున్నారని లావ్రోవ్ ఆరోపించారు. నార్డ్‌స్ట్రామ్ 2 గ్యాస్ పైప్‌లైన్‌ను రద్దు చేసి అమెరికా తన నిజస్వరూపాన్ని బైటపెట్టిందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News