మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఫ్లెక్సీలు పెద్దఎత్తున వెలిశాయి. దేశ్‌కి నేతా కెసిఆర్ అంటూ ఆ ఫ్లెక్సీపై నినాదాలు ఉండడం విశే షం. ఇలాంటి ఫ్లెక్సీలు ఇటీ వల కాలంలో పెద్దఎత్తున వెలుస్తున్నాయి. మొన్న మహారాష్ట్ర, నిన్న ఎపి, నేడు యుపిలో సిఎం కెసిఆర్ ఫ్లెక్సీలు వెలుస్తుండడం రాజకీయ వర్గాల్లోనూ విస్మ యం కలుగుతోంది. తమిళనాడులో రెండు రోజుల తెలంగాణ రైతు,వ్యవసాయ అనుకూల పథకాలను ఇక్కడ కూడా అమలు చేయాలని అక్కడి రైతుల డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ను తెలంగాణలో చేర్చాలని అక్కడి ప్రజల డిమాండ్ చేయడమే కాకుం డా గ్రామసభల్లో తీర్మాణాలు కూడా చేశారు. ఇక రాయచూరు ప్రాంతాన్ని తెలం గాణలో కలపాలని కర్ణాటకకు చెందిన అధికార పార్టీ బిజెపి ఎం ఎల్‌ఎ డిమాం డ్ చేశారు. కాగా తెలంగాణ పథకాలు… రైతుబంధును కాపీ కొట్టిన కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో అమలు చేస్తోంది. అలాగే మిషన్ భగీరథ పథకాన్ని జల్ శక్తి మిషన్‌గా కేంద్రం ప్రకటించింది. దీనిని అనేక రాష్ట్రాలు రోల్‌మోడల్‌గా తీసుకుని అమలు చేసేందుకు కూడా యత్నిస్తున్నాయి.