- Advertisement -
హైదరాబాద్: ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ అధికారిక నివాసానికి సిఎం కెసిఆర్ చేరుకున్నారు. కెసిఆర్ దంపతులను, బృందాన్ని హేమంత్ సోరేన్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఝార్ఖండ్ సిఎం, జే ఎమ్ఎమ్ అధ్యక్షుడు శిబూ సొరేన్ తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. సిఎంతో పాటు ఎమ్మెల్సీ కె. కవిత, ఎంపీ జె.సంతోష్ కుమార్, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు. గల్వన్ వ్యాలీలో చనిపోయిన సైనికులకు కెసిఆర్ ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం రేపు వారి స్వరాష్ట్రం కు వెళ్లి చెక్కులను అందజేశారు. అమర సైనికుడు కుందన్ కుమార్ ఓజా భార్య నమ్రత కుమారికి, వీర సైనికుడు గణేష్ కుటుంబ సభ్యులకు 10 లక్షల సాయం అందించారు.
- Advertisement -