Monday, December 23, 2024

ములుగు జిల్లా ప్రజలపై సిఎం కెసిఆర్ కు అమిత ప్రేమ: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Health Profile project in Mulugu

 

ములుగు: ములుగు జిల్లా ప్రజలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ కు అమితమైన ప్రేమ ఉండడంతో హెల్ ప్రొఫైల్ గొప్ప కార్యక్రమం ఇక్కడ ప్రారంభించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశంసించారు. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ములుగు జిల్లా కలెక్టరెట్ లో  వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని హెల్త్ ప్రొఫైల్ మొదటి సారిగా ములుగు జిల్లాలో అమలవుతుండడంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోటో ప్రతి ఒక్కరూ ఇంట్లో పెట్టుకోవాలని సూచించారు. గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని అడిగితే తనకు మొండిచేయి చూపారని, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 600 కోట్లు ఇచ్చారని మోడీ ప్రభుత్వంపై ఎర్రబెల్లి మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News