ఒక్క రోజులోనే 5,921 కేసులు, 289 మరణాలు నమోదు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కేసులు అదుపులోకి వస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం శుక్రవారం 9 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 5,921 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.63 శాతం, వారాంత పాజిటివిటీ రేటు 0.84 శాతంగా రికార్డయినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక 24 గంటల్లో కరోనా వ్యాధి 5,14,878కి పెరగడంతోపాటు 289 తాజా మరణాలు చోటుచేసుకున్నాయి. మొత్తం వ్యాధి సంక్రమణల్లో క్రియాశీలక కేసులు 0.17 శాతం. కాగా కొవిడ్19 రికవరీ రేటు 98.65 శాతం అని, ఈ ఏడాది జనవరి నుంచి సంభవించిన మరణాల్లో 92 శాతం టీకా తీసుకోని వారిలోనే నమైదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటి వరకు 4.29 కోట్ల మందికి కరోనా సోకగా, 5.14 లక్షల మంది మరణించారు.
ప్రస్తుతం కొవిడ్19 కేసుల సంఖ్య ఇప్పుడు 4.29కోట్లకుపైగా చేరుకుంది. వాటిలో క్రియాశీలక కేసులు 63,878 అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా శనివారం తెలిపింది. కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.23 కోట్లు దాటింది. కాగా మరణాలు రేటు 1.20 శాతంగా రికార్డయింది. దేశవ్యాప్తంగా ఇచ్చిన కొవిడ్ టీకా డోసులు 178.55 కోట్లను దాటింది.