- Advertisement -
కఠ్మండూ: నేపాల్‌లో భూకంపం సంభవించింది. నేపాల్ రాజధాని కఠ్మండూలో ఆదివారం తెల్లవారుజామున 4.37 గంటల సమయంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.3గా నమోదైనట్లు తెలిపింది. కఠ్మండూకు ఈశాన్యం దిశగా 166 కిలోమీటర్ల దూరంలో 135కిమీ లోతులో భూకంప కేంద్రం ఏర్పడినట్లు పేర్కొంది. భూకంపం కారణంగా జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని తెలిపింది.
Earthquake of Magnitude 4.3 hits Kathmandu
- Advertisement -