హైదరాబాద్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో ఆదివారం జరుగుతున్న తొలి మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ ఆదిలోనే మొదటి వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్లలోనే ఓపెనర్ షఫాలీ వర్మ(0) డకౌటైంది. అనంతరం క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మతో కలిసి మరో ఓపెనర్ స్మృతి మంధనా పాక్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో మంధనా(52) అర్థ శతకం సాధించింది. ఇక, దీప్తి(40) కూడా ధనాధన్ బ్యాటింగ్ తో వేగంగా పరుగులు రాబట్టింది. అయితే, వీరిద్దరూ వేగంగా ఆడే క్రమంలో పెవిలియన్ చేరారు. దీంతో టీమిండియా 98 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్(4), హర్మన్ ప్రీత్ కౌర్(4)లు నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం భారత్ 28 ఓవర్లలో 106 పరుగులు చేసింది.
Womens World Cup: INDW lost 3 wickets against PAKW