- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కేసులు అదుపులోకి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 9 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 5,476 మందికి కరోనా పాజిటివ్ తేలిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక, కరోనాతో 158మంది బాధితులు ప్రాణాలు కోల్పోగా.. కొత్తగా 9754మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4.29కోట్లకుపైగా చేరుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,15,036కు చేరుకోగా, కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.23 కోట్లు దాటింది. ప్రస్తుతం దేశంలో 59,442 కరోనా యక్టీవ్ కేసులు ఉన్నాయి. అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా శనివారం తెలిపింది. దేశవ్యాప్తంగా ఇచ్చిన కొవిడ్ టీకా డోసులు 178.55 కోట్లను దాటింది.
India Report 5476 new corona cases in 24 hrs
- Advertisement -