Sunday, January 5, 2025

కాసేపట్లో తెలంగాణ కేబినెట్ మీటింగ్

- Advertisement -
- Advertisement -

Telangana cabinet meeting for a while

 

హైదరాబాద్: కాసేపట్లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ మీటింగ్ ప్రారంభం కానుంది. కేబినెట్ 2022-23 బడ్జెట్ ను ఆమోదించనున్నారు. నిన్న గవర్నర్ ప్రకటనపైనా కేబినెట్ చర్చించనున్నారు. అసెంబ్లీ అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించనున్నట్టు సమాచారం. ఢిల్లీ పర్యటన, సిఎంతో సమావేశాలను కేబినెట్ సహచరులకు కెసిఆర్ వివరించనున్నారు. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 11:30 గంటలకు సభలో మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి రెండున్నర లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. దళితబంధుతో పాటు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News