- Advertisement -
హైదరాబాద్: రోడ్డుపై పడి ఉన్న అనాథ మహిళను చూసి చలించిన కానిస్టేబుల్ ఆమెకు ఆహారం పెట్టడమే కాకుండా ఆలేటి ఆశ్రమంలో చేర్పించారు. ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్ పెట్రోల్ కార్ 3లో కానిస్టేబుల్ శివశంకర్ శనివారం రాత్రి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలకుంట ఎక్స్ రోడ్డు వద్ద మహిళ కడుపు నొప్పితో బాధపడుతున్నది గమనించాడు. వెంటనే 108కు ఫోన్ చేసి రప్పించాడు. ఆమెకు ఆహారం, నీరు తెప్పించి ఇచ్చాడు. తర్వాత అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఆలేటి ఆశ్రమంలో చేర్పించాడు. కానిస్టేబుల్ దాతృత్వాన్ని పలువురు అభినందించారు.
- Advertisement -