Saturday, December 21, 2024

యుద్ధోన్మాదమే

- Advertisement -
- Advertisement -

Russia's deadly offensive in Ukraine enters its 11th day

ఉక్రెయిన్‌పై 11వ రోజూ కొనసాగిన రష్యా దాడులు

విన్సిటియా విమానాశ్రయాన్ని
ధ్వంసం చేశాయి: జెలెన్‌స్కీ
జనావాసాలే లక్షంగా రష్యా
దాడులు బ్రిటీష్ ఇంటెలిజన్స్
ఆరోపణ ఆ రెండు నగరాల్లో
కాల్పుల విరమణ పొడిగింపు
పది రోజుల్లో 15 లక్షల మంది
వలస: ఐరాస నెత్తుటి ఏరులు
పారుతున్నాయంటూ పోప్
ఆవేదన పది రోజుల్లో 15 లక్షల మంది వలస వెళ్లారు

కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు 11వ రోజుకు చేరుకున్నాయి. క్షిపణులు, రాకెట్లు, బంబులతో ఉక్రెయిన్ ప్రధాన నగరాల్లో భవనాలపై విరుచుకు పడుతోంది. కాగా సెంట్రల్ వెస్ట్రన్ రీజియన్ రాజధాని అయిన విన్సిటియాలో ఉన్న వి మానాశ్రయాన్ని రష్యా సేనలు ఆదివారం పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ తెలిపారు. రష్యా సైన్యం రాకెట్లతో విరుచుకుపడినట్లు ఆయన చెప్పారు. అయితే ఉక్రెయిన్‌లోని జనావాస ప్రాంతాలనే లక్షంగా చేసుకుని రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయని బ్రిటీష్ ఇంటెలిజన్స్ విభాగం ఆదివారం ఆరోపించింది.

ఖార్కివ్, చెర్నోహివ్,మరియుపోల్ నగరాల్లోని జనావాసాలపైనే దాడులకు పాల్పడినట్లు పేర్కొంది. రష్యా గతంలో నూ చెచెన్యా, సిరియాల్లో ఇలాంటి వ్యూహాలనే ఉపయోగించిందని ఆరోపించింది. అయితే ఉక్రెయిన్ దీటుగా స్పందిస్తుండడంతో రష్యా సేనలు వేగంగా ముందుకెళ్లలేకపోతున్నాయని ఇంటలిజన్స్ విభాగం చెప్పుకొచ్చింది. ఉక్రెయిన్‌ను రష్యా తక్కువగా అంచనా వేసిందని, ఆ దేశ ప్రతిఘటనను చూసి ఆశ్చర్య పోతోందని పేర్కొంది. ఇదిలా ఉంఏటే తాము పౌర ప్రాంతాలను లక్షం చేసుకొంటున్నట్లు వస్తున్న ఆరోపణలను రష్యా ఖండిస్తూనే ఉంది.

ఆ రెండు నగరాల్లో కాల్పుల విరమణ పొడిగింపు

ఉక్రెయిన్‌నుంచి పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు వీలుగా శనివారం కొద్ది సేపు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ రష్యా సేనలు మళ్లీ దాడులు మొదలు పెట్టాయి. దీంతో పౌరులు నగరాన్ని వీడి వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయిందని మరియుపోల్, వోల్నవాఖ్ నగరాల అధికారులు ఆరోపించారు. దీనిపై అన్ని వైపులనుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆ రెండు నగరాల్లో ఆదివారం కూడా కాల్పుల విరమణను కొనసాగించనున్నట్లు రష్యా ప్రకటించింది.

నేడు మరోవిడత చర్చలు

కాగా రష్యాఉక్రెయిన్‌ల మధ్య మూడో విడత చర్చలు సోమవారం జరుగుతాయని ఉక్రెయిన్ అధికారి డేవిడ్ అరఖామియా తెలిపారు. ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణపై గతంలో రెండు విడతలు చర్చలు జరిగినా అసంపూరిత్గా ముగిసిన విషయం తెలిసిందే.

పది రోజుల్లో 15 లక్షల మంది వలస వెళ్లారు

రష్యా దాడుల నేపథ్యంలో గత పది రోజుల్లో 15 లక్షల మంది ఉక్రెఇన్‌ను వీడి పొరుగు దేవాలకు వెళ్లారని ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజన్సీ( యుఎన్‌హెచ్‌సిఆర్) హైకమిషనర్ ఫిలిప్పో గ్రాండి తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అతిపెద్ద మానవతా సంక్షోభం ఇదేనని ఆయన అన్నారు.

ఆరోగ్య కేంద్రాలపై దాడులను ఖండించిన డబ్లుహెచ్‌ఓ

ఉక్రెయిన్‌లోని ఆరోగ్య కేంద్రాలపై దాడులను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఓ) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనల్లో ఆరుగురు మృతి చెందారని, 11 మంది గాయపడ్డారని పేర్కొంది. ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, హెల్త్‌వర్కర్లపై దాడులు హేయమని, అలా చేయడం అంతర్జాతీయ మానవతా చట్ట ఉల్లంఘనేనని డబ్లుహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అథానమ్ వ్యాఖ్యానించారు.

ఉక్రెయిన్‌లో నెత్తుటి నదులు పారుతున్నాయి: పోప్

ఉక్రెయిన్‌లో రష్యా దాడులపై పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. యుద్ధం కారణంగా ఆ దేశంలో నెత్తుటి, కన్నీటి నదులు పారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ ఇది కేవలం సైనిక చర్య కాదు. మరణం, విధ్వంసం, దుఃఖాన్నినాటుతున్న యుద్ధం’ అని విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో శరణార్థుల కోసం మానవతా కారిడార్లు ఏర్పాటు చేయాలని కోరారు.

సైన్యంలో చేరేందుకు క్యూ కడుతున్న ఉక్రెయిన్ యువత

మరో వైపు రష్యా దాడులను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ యువకులు ముందుకు వస్తున్నారు. స్వచ్ఛందంగా సైన్యంలో చేరేందుకు క్యూ కడుతున్నారు.16 60 ఏళ్ల మధ్య వయసు వారు దేశాన్ని వీడి వెళ్లకుండా ప్రభుత్వ ఇప్పటికే నిషేధం విధించింది. సైనిక శిక్షణకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఐరోపా సమాఖ్యలో, ఇతర దేశాలనుంచి కూడా మాజీ సైనికులు ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్నారు.

ఉక్రెయిన్ ప్రవాస ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు?

ఇదిలా ఉండగా రష్యా దాడులను ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నప్పటికీ అమెరికా, ఐరోపా దేశాలు ఆ దేశాధ్యక్షుడ్ని కాపాడేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. రష్యా దళాలు తమ నష్టాలను త్వరగా పూడ్చుకొని ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తాయని అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలండ్‌లో ఉక్రెయిన్‌ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, అక్కడినుంచి పాలన నిర్వహించేందుకు వీలుగా రహస్య సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఎలాన్ మస్క్‌కు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు

ఇంటర్నెట్ అంతరాయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు స్టార్‌లింక్ సేవలనుఅందుబాటులోకి తెచ్చినందుకు ఎలాన్‌మస్క్‌కు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు చెప్పారు. రష్యా దాడుల్లో ధ్వంసమైన నగరాల్లో మరిన్ని టెర్మినళ్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఇప్పటికీ ఉక్రెయిన్‌లోని కొన్ని నగరల్లో ఇంటర్నెట్,, ఫోన్‌లైన్ సేవలు అందుబాటులో లేవు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News