- Advertisement -
హైదరాబాద్ : కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించడంతో ఎనిమిది నెలల చిన్నారికి తీవ్ర గాయాలైన సంఘటన ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఈఎస్‌ఐ ఆస్పత్రి నుంచి బికే గూడ వైపునకు అతివేగంగా వస్తున్న కారు చౌరస్తా వద్ద స్కూటీ, బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఎనిమిది నెలల చిన్నారి కూడా ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనస్థలానికి చేరుకుని కారును సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -