Monday, December 23, 2024

కామవాంఛ తీర్చలేదని కత్తెరతో మెడపై పొడిచి….

- Advertisement -
- Advertisement -

Young man murder women over Sexual desire

అమరావతి: కామవాంఛ తీర్చలేదని మహిళను ఓ వ్యక్తి కత్తెరతో పలుమార్లు పొడిచి హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా ఆముదావలస ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గోకర్లపల్లి గ్రామానికి చెందిన మహేష్ ఓ మహిళతో పరిచయం ఉంది. పరిచయాన్ని కాస్తా చనువుగా తీసుకొని ఆమెను లైంగికంగా వేధించాడు వాడు. అతడి వేధింపులను తట్టుకోలేక అతడికి దూరంగా ఉంటుంది. మార్చి 4న ఆమెతో ఫోన్‌లో మాట్లాడి ఇంటికి వస్తున్నానని చెప్పాడు. స్కూటీపై ఆముదావలసకు చేరుకొని మార్కెట్ సమీపంలో స్కూటీని పార్కింగ్ చేశాడు. అనంతరం ఆమె ఇంటికి వెళ్లి లైంగిక వాంఛ తీర్చాలని కోరాడు.

ఆమె నిరాకరించడంతో కుట్టు మిషన్‌పై ఉన్న కత్తెరతో మెడ భాగంలో దించాడు. ఆమె గట్టిగా అరవడంతో నోరూ మూశాడు. పక్కింటి వారు శబ్ధం వినిపించగానే అక్కడి చేరుకున్నారు. ఉలుకుపలుకు లేకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే కత్తెర తీసుకొని పలుమార్లు మెడపై పొడవడంతో ఆమె అక్కడనే చనిపోయింది. మహేష్ దుస్తువులపై రక్తపు మరకలు పడడంతో బాత్‌రూమ్‌లో స్నానం చేసి ఇంటికి వెళ్లిపోయాడు. చేతికి చిన్నపాటి గాయాలు కావడంతో స్కూటి పైనుంచి పడిపోయానని ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. శుక్రవారం రాత్రయినా ఆమె తలుపుతెరవకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సిఐ పైడయ్య తన సిబ్బంది కలిసి ఘటనా స్థలానికి చేరుకొని బలవంతంగా డోర్ ఓపెన్ చేయగా ఆమె రక్తపు మడుగులో కనిపించింది. ఫోన్ కాల్, సిసి టివి ఆధారంగా దర్యాప్తు చేయగా మహేష్‌తో చివరి కాల్ మాట్లాడినట్టు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News