Monday, December 23, 2024

టేకు కలప అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్న ఫారెస్టు అధికారులు

- Advertisement -
- Advertisement -

పాత పత్రాలతో సామిల్లుల్లో టేకు విక్రయాలు
నామమాత్రంగా విచారణ చేపడుతున్న అటవీ శాఖ అధికారులు

మన తెలంగాణ / తాండూరు: టేకు కలప అక్రమ రవాణాకు ఫారెస్టు అధికారులే ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాండూరులో నాలుగైదు సా మిల్లులు ఉన్నాయి. సామిల్లులు నడిపిస్తున్న వ్యాపారాలు పాత పత్రాలతో టేకు కలప విక్ర యాలు చేపడుతూ సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాండూరు పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న నేషనల్ గార్డెన్ ముందు సామిల్లులో సోమవారం టేకు కలప నిల్వ చేశారు. స్థానికులు ఫారెస్టు అధికారులకు సమాచారం అందించిన్నప్పటికి తాండూరు రేంజ్ అధికారి శ్యాంసుందర్ రెండు గంటల వరకు రాలేకపోయారు.

జిల్లా ఫారెస్టు అధికారులకు ఫిర్యాదు చేయడంతో తాండూరు ఫారెస్టు అధికారులు సామిల్లును తనిఖీ చేశారు. సామిల్లు వ్యాపారికి టేకు కట్టెలు కోసే అనుమతులు ఉన్నప్పటికి, వాటిని తీసుకురావడానికి అనుమతులు లేవు. గత సంవ త్సరం డిసెంబరు నెలాఖరు నాటికి పత్రాలు ఉన్నాయి. అదే విధంగా సామిల్లులో టేకు కలప నిల్వ చేసేందుకు కూడా ఎలాంటి అనుమతులు లేవు. అయితే తాండూరు ఫారె స్టు అధికారుల కనుసైగల్లో ఈ టేకు కలప అక్రమ వ్యాపారం సాగిస్తున్నారనే విమ ర్శలు వస్తున్నాయి.

సోమవారం సామిల్లులో పెద్ద ఎత్తున టేకు కలప కోతలు వేసి నిల్వ చేసిన్నప్పటికి తాండూరు ఫారెస్టు అధికారులు సామిల్లుకు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అధికారులకు సామిల్లుల నుంచి ప్రతి నెలా మామూళ్లు అందుతుం డటంతో నామమాత్రంగా విచారణ జరిపి ఎలాంటి జరిమానా వేయకుండా యజ మానిని హెచ్చరించి వెళ్లిపోయారు. ఇలా పట్టపగలే అక్రమ టేకు కలప వ్యాపారం జరుగుతున్నప్పటికి ఫారెస్టు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా అధికారులు దృష్టి సారించి తాండూరులో జరుగు తున్న అక్రమ కలప రవాణాపై చర్యలుతీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News