Monday, December 23, 2024

రేపు అసెంబ్లీలో ప్రకటన చేయబోతున్నా.. నిరుద్యోగులంతా టీవీలు చూడాలి

- Advertisement -
- Advertisement -

వనపర్తిః తెలంగాణ నిరుద్యోగ యువ సోదరులకు శుభవార్త చెప్పబోతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం నాగవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. ”తెలంగాణ నిరుద్యోగ యువ సోదరులకు రేపు అసెంబ్లీలో ప్రకటన చేయబోతున్నా. నిరుద్యోగులంతా రేపు ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని కోరుతున్నా. తెలంగాణ ఆవిష్కరణపై రేపు అసెంబ్లీ చెప్పబోతున్నా. తెలంగాణ ఎలా అభివృద్ధి చెందిందో.. భారతదేశం అంతా అలాగే అభివృద్ధి చెందాలి. ఎన్నో పనులు ఎవరూ అడగకుండానే చేసుకున్నాం. ఎవరు దరఖాస్తు పెట్టకున్నా.. ధర్నాలు చేయకున్నా చేసుకున్నాం. ఈ మధ్య దేశంలో గోల్‌మాల్ గోవిందం గాళ్లు తయారయ్యారు. దేశం కోసం పోరాడేందుకు ముందుకు వెళ్లాలి. తెలంగాణ ఉద్యమంలో ఎలా కొట్లాడామో.. దేశం కోసం అలాగే కొట్లాడుదాం. దేశం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తా” అని అన్నారు.

CM KCR Speech AT Nagavaram Public Meeting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News