జగిత్యాల: సొంత తమ్మున్నే అక్క హత్య చేయించిన దారుణం సంఘటన జిల్లాలోని మెట్పల్లిలో చోటుచేసుకుంది. ఆరు నెలల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మెట్ పల్లి కళానగర్ నుంచి గత ఏడాది సెప్టెంబర్ 3న అదృశ్యమైన మహ్మద్ సోహైల్(19) హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. సోహైల్ హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. తోటి స్నేహితులతో సోహైల్ ను సొంత అక్క నిశాత్ ఫాతిమానే హత్య చేయించిందని మెట్ పల్లి డీఎస్పీ రవీంద్రరెడ్డి వెల్లడించారు. సొహైల్ అక్కతో ఓ అబ్బాయికి అక్రమం సంబందం ఉంది. ఈ విషయం సోహైల్ కు తెలిసి ఆమెను బెదిరింపులకు పాల్పడడంతోనే హత్య చేశారని డీఎస్పీ చెప్పారు. సోహైల్ ను చంపితే సుఫారీ రూ.లక్ష ఇస్తానని సోహైల్ అక్క నిందితులకు చెప్పింది. దీంతో పథకం ప్రకారం సోహైల్ ను హత్య చేసినట్లు డిఎస్పీ తెలిపారు.
Brother Murdered by Sister hires Supari Gang in Jagtial