Monday, December 23, 2024

కేంద్ర సంస్థలతో బిజెపి కుమ్మక్కు సుస్పష్టం

- Advertisement -
- Advertisement -
NCP Chief Sharad Pawar BJP Government
మరాఠా పరిణామాలపై పవార్

ముంబై: కేంద్ర ప్రభుత్వం మరాఠా నేతలపై స్నూప్పింగ్‌కు కేంద్రీయ దర్యాప్తు సంస్థలను పావుగా వాడుకుంటున్నాయని ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ విమర్శించారు. మహారాష్ట్రలోని ఎంవిఎ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పలుమార్లు యత్నించింది. విఫలం చెంది చివరకు నిరాశ నిస్పృహలతో ఇతరత్రా రాజకీయ వేధింపులకు దిగిందని ఆయన బుధవారం ఇక్కడ ఆరోపించారు. ఇందుకు పలు సాక్షాధారాలు తమ వద్ద ఉన్నాయని పవార్ తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత బిజెపికి చెందిన మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారం కేంద్రీయదర్యాప్తు సంస్థల వీడియో రికార్డులను ప్రదర్శించడం బిజెపికి ఏ విధంగా సిబిఐ ఇతర దర్యాప్తు సంస్థలు దాసోహం అయ్యాయనేది తెలియచేస్తున్నాయని పవార్ తెలిపారు. కొందరు బిజెపి నేతలను కేసులలో ఇరికించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందని తెలిపే వీడియోలను దర్యాప్తు సంస్థలు సేకరించడం, వీటిని ప్రతిపక్ష నేత సభలో ప్రవేశపెట్టడం పరిస్థితిని తెలియచేసిందని పవార్ తెలిపారు.

రాష్ట్రాల వ్యవహారాలలో కేంద్రీయ దర్యాప్తు సంస్థలు ఏ విధంగా జోక్యం చేసుకుంటున్నాయనేది ఫడ్నవిస్ చెపుతున్న దాదాపు 125 గంటల వీడియో రికార్డింగ్‌లతోనే స్పష్టం అయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తుందని, టేప్‌ల విశ్వసనీయతను బయటపెడుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. బిజెపి నేతలు రాష్ట్రంలోని మహారాష్ట వికాస్ అగాధీ (ఎంవిఎ) ప్రభుత్వంపై ఆరోపణలకు దిగడం, దీనికి సిబిఐ వంటి సంస్థల నుంచి ఆధారాలు సేకరించుకోవడం వంటి పరిణామాలు అన్నీ కూడా ఉన్నతస్థాయిలో సాగుతోన్న వ్యవహారాలను వెల్లడిస్తున్నాయని తెలిపారు. బిజెపి నేతలు ఫిర్యాదులకు దిగడం, ఎన్నికైన ప్రజా ప్రతినిధులను లక్షంగా చేసుకుని ఎదురుదాడులకు దిగడం కీలక పరిణామాలు అని, ప్రతిపక్ష పాలిత మహారాష్ట్ర , పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలను ప్రధానంగా తాము ప్రస్తావిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News