Sunday, January 5, 2025

అటెన్షన్ డైవర్ట్ కేసులో నిందితుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Defendant arrested in Attention Divert case

హైదరాబాద్: అటెన్షన్ డైవర్ట్ చేసి డబ్బులు ఉన్న బ్యాగును చోరీ చేసిన కేసులో బహదూర్‌పుర పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.10లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన నాసారి లక్ష్మినారాయణ అలియాస్ హరీష్ అంబికా ఐరన్ అండ్ స్టీల్ వ్యాపారం వద్ద పనిచేస్తున్నాడు. ఈ నెల 7వ తేదీన రాత్రి 8.30 గంటలకు యజమాని చెప్పిన వారి వద్ద డబ్బులు రూ.10లక్షలు కలెక్ట్ చేసుకుని బ్యాగును బ్యాకుకు పెట్టుకుని వచ్చాడు. అంబికా ఐరన్ షాపు ఎదుట తనతోపాటు పనిచేస్తున్న ఎపిలోని అనంతపురం జిల్లా, గుంతకల్‌కు చెందిన మనోహర్ డబ్బులు ఉన్న బ్యాగును చోరీ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ కేసు దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News