- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,184 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 104 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 44,488 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 6,554 మంది కోలుకోగా.. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 4.24కోట్ల మంది బాధితులు కోలుకున్నారు. ఇక, కరోనాతో దేశంలో మొత్తం 5,15,459మంది బాధితులు మరణించారు.ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిన సంఖ్య 179కోట్లు దాటింది.
India Reports 4184 new corona Cases in 24 hrs
India Reports 4184 new corona Cases in 24 hrs
- Advertisement -