బ్రిస్బేన్: ఆస్ట్రేలియాలో హైదరాబాద్ యువకుడు ఈతకొలనులో పడి చనిపోయాడు. సికింద్రాబాద్ ప్రాంతం రెజిమెంటల్ బజార్‌కు చెందిన రాచకొండ శ్రీనివాస్-రమణ దంపతులు కుమారుడు సాయి(25) ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. ఎంఎస్ చదువుతూ సివిల్ ఇంజనీరింగ్‌లో ఉద్యోగంలో చేరాడు. గత సంవత్సరం బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో అతడు కాలు విరిగిపోయింది. వైద్యులు సూచనల మేరకు కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. వైద్యులు స్విమ్మింగ్ చేయాలని సూచించారు. బ్రిస్బేన్‌లోని తన ఆపార్ట్‌మెంట్ కింద ఈత కొలను వద్దకు వెళ్లాడు. రైలింగ్ పట్టుకొని స్విమ్మింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. తెలుగు సంఘాలు, తెలుగు విద్యార్థులు సాయి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయి మృతదేహాన్ని తరలించేందుకు 25 నుంచి 30 లక్షల రూపాయల వరకు ఖర్చు కానున్న నేపథ్యంలో తెలుగు సంఘాలు, విద్యార్థులు బరిస్తున్నారు.
ఆస్ట్రేలియాలో హైదరాబాద్ యువకుడు మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -