Sunday, November 24, 2024

రూ.3866 కోట్లతో ఎస్ టిపిలు నిర్మిస్తాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రూ.900 కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. నాచారంలోని ఎస్ టిపి పనులు, ఉప్పల్ ఫ్లై ఓవర్ పనులకు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. ఉప్పల్ రింగ్ రోడ్డులోని థీమ్ పార్కును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రూ.3866 కోట్లతో ఎస్ టిపిలు నిర్మిస్తున్నామని, ఏడాదిన్నరలోపు ఉప్పల్ తో మరి కొన్ని ఫ్లై ఓవర్లు పూర్తి చేస్తామని, రూ.35 కోట్లతో నిర్మించిన స్కైవాక్ ను వచ్చే నెలలో ప్రారంభిస్తామన్నారు. వచ్చే నెల నుంచి కొత్త ఫెన్షన్లు ఇస్తామని స్పష్టం చేశారు.  రూ.7300 కోట్లతో మన ఊరు- మన బడి కార్యక్రమం చేపడుతామని, వచ్చే జూన్ నుంచి సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువులు ఉంటాయన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల భారం తొలగిస్తామని, ఎల్ బినగర్ లో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని కెటిఆర్ హామీ ఇచ్చారు.

హైదరాబాద్ లో 70 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తైందని, అసెంబ్లీ సమావేశాల తరువాత డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అప్పగిస్తామన్నారు. సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి మూడ లక్షల రూపాయలు ఇస్తామని, వచ్చే నెలలో చర్లపల్లిలో ఆర్ యుబి ప్రారంభిస్తామని, హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ఐటి రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, స్థానికులకు ఇక్కడ నుంచే ఉద్యోగాలు వస్తాయని, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సిఎం కెసిఆర్ పాలన ఉందని ప్రశంసించారు. సిఎం కెసిఆర్ ప్రకటనను నమ్మిన వాళ్లు ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని, నమ్మనివాళ్లు ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తానన్న రెండు కోట్ల పకోడీ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News