Monday, November 18, 2024

భారతీయ దౌత్యాధికారికి పాక్ సమ్మన్లు

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: భారతీయ సూపర్ సోనిక్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ తన గగనతలంలోకి ప్రవేశించినందుకుగాను పాకిస్థాన్ ఇస్లామాబాద్‌లోని భారతీయ ఛార్జీ డి అఫైర్స్‌ను సమ్మన్ చేసింది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే తన గగనతలంలోకి ఓ ఎగిరే వస్తువు రావడంపై ఆక్షేపణను తెలిపింది. ఈ ఘటనపై పారదర్శక, సంపూర్ణ విచారణ జరపాలని కోరింది. భారత్‌లోని సూరత్‌గఢ్ నుంచి పాకిస్థాన్‌లోకి మార్చి 9న 6.43 గంటలకు సూపర్ సోనిక్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ప్రవేశించిందని విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటన జారీచేసింది. అయితే ఎగిరే వస్తువు చివరికి అదేరోజు సాయంత్రం 6.50 గంటలకు పాకిస్థాన్‌కు చెందిన పంజాబ్‌లోని మియాన్ చున్ను నగరం వద్ద నేల కూలింది. అయితే దీని వల్ల ఎలాంటి నష్టం జరగలేదని సమాచారం. అయితే ఈ ఘటనపై భారత్ తరఫు నుంచి ఎటువంటి ప్రతిచర్య లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News