Wednesday, January 22, 2025

బిజెపివి చిల్లర రాజకీయాలు

- Advertisement -
- Advertisement -
Minister Koppula Eshwar fires on BJP Government
మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతిరాథోడ్
అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు పనులను పరిశీలన

హైదరాబాద్ : అంబేద్కర్ చూపిన మార్గంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. శుక్రవారం అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు పనులను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేగవంతంగా బిజెపి నాయకులు తెలంగాణ రాష్ట్రాభివృద్ధి, ప్రజల బాగు గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రతి విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడితే ప్రశంసించకపోగా విమర్శలకు దిగడం విచారకరం అన్నారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు పనులు వేగవంతంగా కొనసాగుతుంటే బిజెపి నాయకులు ఇక్కడకు వచ్చి చిల్లర వ్యాఖ్యలు చేశారు.

వారి వల్ల ఈ పవిత్రమైన స్థలం మలినం కావడంతో అంబేడ్కర్‌వాదులు శుద్ధి చేయడం జరిగిందన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అంటే తమకు ఎంతగానో గౌరవమని, టిఆర్‌ఎస్ పోరాడి అసెంబ్లీ ఆవరణలో విగ్రహాన్ని ఏర్పాటు చేయించడం జరిగిందని గుర్తుచేశారు.నగరం నడిబొడ్డున సుమారు 12 ఎకరాలలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పనులు రేయింబవళ్లు వేగవంతంగా ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు. విగ్రహంతో పాటు మ్యూజియం, ధ్యాన మందిరం, గ్రంథాలయం, సమావేశ మందిరాలు, ఫోటో గ్యాలరీ, క్యాంటిన్, అతిథుల కోసం గదులు, టాయిలెట్లు నిర్మిస్తున్నామని తెలిపారు. సువిశాలమైన పార్కింగ్, పచ్చదనంతో పరిసరాలను సుందరంగా, ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని మంత్రులు తెలిపారు. ఈ పర్యటనలో మంత్రుల వెంట ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, డాక్టర్ మెతుకు ఆనంద్, హన్మంతు షిండే,శంకర్ నాయక్,చిన్నం దుర్గయ్య,ఆరూరి రమేష్, కోరుకంటి చందర్,క్రాంతికిరణ్, రవిశంకర్, రేఖా నాయక్, మాజీ ఎంపి సీతారాం నాయక్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News