- Advertisement -
న్యూఢిల్లీ : ఈస్టర్న్ లద్ధాఖ్‌లో ప్రతిష్టంభన శాశ్వత నివారణ దిశలో భారత్ -చైనాల మధ్య 15వ దఫా సైనిక స్థాయి చర్చలు జరిగాయి. శుక్రవారం జరిగిన ఈ సంప్రదిపుల క్రమంలో ఎటువంటి ఫలితం వెలువడిందనేది వెల్లడి కాలేదు. అత్యున్నత స్థాయిలో సైనిక సంప్రదింపులు జరిగాయి. రెండు నెలల క్రితం జరిగిన 14వ దఫా సంప్రదింపులలో ఎటువంటి పురోగతి కన్పించలేదు. దీనితో మరోమారు చర్చలు జరిగాయి. హాట్ స్ప్రింగ్స్ ( పెట్రోలింగ్ పాయింట్ 15) ప్రాంతంలో నిలిచిపోయిన సైనిక ఉపసంహరణ ప్రక్రియను తిరిగి ఆరంభించే దిశలో ఇప్పటి సైనిక స్థాయి సంప్రదింపులు జరిగాయి.
- Advertisement -