- Advertisement -
తదుపరి సర్కారు ఏర్పాటుకు చర్యలు
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో శుక్రవారం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్‌కు రాజీనామా సమర్పించారు. తనతో పాటు తమ మంత్రి మండలి రాజీనామాను అందించినట్లు, ప్రస్తుత అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లో తిరిగి బిజెపి అధికారంలోకి వచ్చింది. తగిన బలం సాధించుకుంది. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ శుక్రవారం తమ పదవికి రాజీనామా చేశారు. తీవ్రవాద ప్రాబల్యపు ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయం సాధించింది. ఇంతకు ముందటి అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి కేవలం 5 స్థానాలు వచ్చాయి. తదుపరి ప్రభుత్వ స్థాపనకు అనువుగా ఉండేందుకు తము గవర్నర్ లా గణేశన్‌కు రాజీనామా పత్రం ఇచ్చినట్లు మణిపూర్ సిఎం తెలిపారు.
- Advertisement -